Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

స్టోరీమిర్రర్ డైజెస్ట్ : సంపుటం 9 (StoryMirror Digest Vol 9)

★★★★★
After purchase of e-magazines, you can read them in your profile page.
Author | StoryMirror Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | e-Magazine Pages | 111 Genre | Abstract
E-MAGAZINE
₹0

ప్రియమైన సృజనాత్మక రచనలను ఇష్టపడే మా పాఠకులకు, రచయితలకు,


ఒక రచయిత జీవితం మిగిలిన అన్ని రంగాలకు భిన్నం. రవి గాంచని చోట కవి గాంచును అన్నట్లు మిగతా ప్రపంచం తన పనుల్లో, విశ్రాంతిలో, వినోదం లో నిమగ్నం అయిన వేళ కూడా రచయిత లోకం బాధను ఆనందాన్ని తానే పరకాయ ప్రవేశం చేసినట్టు అనుభవించి ఆ అనుభూతులకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తాను చదువుతూ లేదా రాస్తూ తన కాలాన్ని కవిత గానో కథ గానో కరిగిస్తాడు. ఆ విజ్ఞానం, వివేకం తరతరాలకు సాహిత్యం రూపం లో నిధిగా అందిస్తాడు.

ఈ డిజిటల్ యుగంలో ఎన్నో మేలిముత్యాల లాంటి రచనలు వెలుగులోకి రావడం లేదు. అందుకు కారణం అధ్భుతమైన రచనలు పొందుపరిచి పాఠకులకు అందించే సరైన వేదిక లేకపోవటం.స్టోరీ మిర్రర్ రచయితలను, పాఠకులను అనుసంధానం చేసే కొత్త ప్రయత్నం మొదలు పెట్టింది. స్టోరీ మిర్రర్ ప్రతి నెల ఒక ఈ మాగజైన్ విడుదల చేస్తోంది ఈ ప్రయత్నం లో.


ఆ మాగజైన్ పేరు..."స్టోరీ మిర్రర్ డైజెస్ట్".ఇది సాహితీ మాస పత్రిక. ఇందులో కేవలం సంపాదక వర్గం ఎన్నుకున్న అత్యుత్తమ రచనలు మాత్రమే స్థానం పొందుతాయి. కొంత కాలం పోయాక ప్రాచీన సాహిత్యం, గొప్ప రచనలు, చర్చా వేదిక, రచయితల పరిచయాలు, ముఖాముఖి కూడా ఈ పత్రిక లో పొందు పరిచే ప్రయత్నం చేస్తాము.


ఈ ఉచిత ఈ - మాగజైన్ పొందేందుకు ఈ విధంగా చేయండి.

*స్టోరీ మిర్రర్ లో లాగిన్ అవ్వండి.

*స్టోరీ మిర్రర్ షాప్ లింక్(https://shop.storymirror.com).

ఈ - మాగజైన్ కోసం సెర్చ్ చేయండి. డౌన్లోడ్ చేసుకోండి.

డౌన్లోడ్ చేసుకున్న ఉచిత ఈ - మాగజైన్ ను మీ స్తోరిమిర్రర్ ఆండ్రాయిడ్ లేదా ఐ ఓ ఎస్ యాప్ లో చదవండి.


ఈ స్టోరీ మిర్రర్ డైజెస్ట్ ను డౌన్లోడ్ చేసుకున్నాక ఆఫ్లైన్ లో కూడా చదవవచ్చు.


ఈ మాగజైన్ ను మీకు మరింత అందంగా అందించేందుకు మీ సలహాలు సూచనలు కోరుతున్నాము...ఈ డైజెస్ట్ విడుదల అయిన కొంత కాలానికి.

 ఈ డైజెస్ట్ లో అంశాలలో మార్పులు చేర్పులు చేసే సెలక్షన్ కమిటీ లో భాగం పంచుకోవాలి అనుకుంటే మీ పేరు ఇవ్వండి.


మనం అందరం కలిసి ఉత్తమ సాహిత్యం సహాయం తో దేశాన్ని నిర్మించే బృహత్తర కార్యక్రమం లో పాలు పంచుకుందాం.






Be the first to add review and rating.


 Added to cart