We will fetch book names as per the search key...
Seller | Price | |
---|---|---|
StoryMirror Best price | — | |
Amazon | Price not available | |
Flipkart | Price not available |
తొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయోక్తి కాదు.
ఈ 1956 నవల నేటి భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది.
చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.
కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు.
చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.
ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది.
ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే
స్త్రీ వాది సరళ, కర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు.
మరొకవైపు యశో రామం సేవా సాంగత్యాలే తన ఆచలిత జీవన ధ్యేయం అని నిర్ధారించుకొని
శరత్ సాహితీ అనుభూతితో అతనిపై వెదజల్లిన ప్రేమానురాగాలు నిశ్చల ప్రేమకు నీరాజనాలు.
అనూహ్య స్త్రీపురుష ద్వందానుబంధాలు ఈ 'క్షంతవ్యులు' సారాంశం
ఈ - కమింగ్ అఫ్ ఏజ్ - పుస్తకం నవలా రచనకి అద్వితీయ నిదర్శనం